calender_icon.png 12 August, 2025 | 12:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో విషాదం.. చెరువులో పడి రామ్, లక్ష్మణ్ మృతి

12-08-2025 11:09:24 AM

  1. ఈతకు వెళ్లి చెరువు గుంతలో చిక్కుకొని మృత్యువాత 
  2. కామారెడ్డి జిల్లాలో విషాదం 

కామారెడ్డి,(విజయక్రాంతి): కుంటలో ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు కుంటలోని గుంతలో చిక్కుకొని మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం తిమ్మక్ పల్లి గ్రామంలో మంగళవారం చోటు చేసు కుoది. తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన గుర్రాల పెద్ద నరసింహులు కు ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. గుర్రాల రాము (13) సంవత్సరాలు గుర్రాల లక్ష్మణ్ (13) సంవత్సరాలు స్థానిక ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. అనంతరం స్థానికంగా ఉన్న కుంటలో స్నానానికి ఈత కొట్టడానికి వెళ్లారు.

తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు రాత్రి వెతికిన వారి ఆచూకీ మంగళవారం ఉదయం స్థానికంగా ఉన్న కుంటలో ఇద్దరి శవాలు లభించాయి. మృతుల తండ్రి గుర్రాల పెద్ద నర్ సింలు నరసింహులు ఫిర్యాదు మేరకు దేవుని పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈత కోసం వెళ్లి నా రాము లక్ష్మణులు కుంట లోని గుంత లో చిక్కుకొని మృతి చెందినట్లు దేవుని పల్లి పోలీసులు  తెలిపారు. శవాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తిమ్మకుపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అందరితో కలివిడిగా తిరిగే పిల్లలు కుంటలోఈతకు వెళ్లి మృత్యువాత పడడం గ్రామస్తులను కలచి వేసింది. చిన్నారుల తల్లి రోధించడం గ్రామస్తులను తీవ్రంగా కలచివేసింది.