calender_icon.png 12 August, 2025 | 1:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం ఎన్నిక

12-08-2025 10:19:48 AM

ఘట్ కేసర్: పోచారం మున్సిపల్ చౌదరిగూడ విజయపురి కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్(Vijayapuri Colony Friends Association) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసోసియేషన్  కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిగా దోర్నాల సంతోష్, ప్రధాన కార్యదర్శిగా ఎన్. భాను కుమార్ గౌడ్,  కోశాధికారిగా గడ్డం నరేష్ , ఉపాధ్యక్షుడిగా రాజురెడ్డి, సంయుక్త కార్యదర్శిగా ప్రకాష్ రెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా రాజేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  వీరితోపాటు కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా శంకర్, ప్రవీణ్, పవన్, బిక్కు నాయక్ సురేష్ శ్రీకాంత్ సభ్యులుగా,  సలహాదారులుగా షేక్ మీరా,  వెంకటేష్, ప్రతాపరెడ్డి, నాయక్, శ్రీధర్, దిగంబర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీ సభ్యులను కాలనీవాసులు శాలువాలతో సత్కరించారు. కాలనీ అధ్యక్ష, కార్యదర్శులు నియమితులైన సంతోష్, భానుకుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విజయపురి కాలనీ అభివృద్ధికి తమ శాయశక్తుల కృషి చేస్తామని, కాలనీ ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మా నూతన కమిటీ కృషి చేస్తుందన్నారు.