17-01-2026 09:53:23 PM
మోతే,(విజయక్రాంతి): శనివారం మండల పరిధిలో జాతీయ రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రజలకు ఉద్యోగులకు రోడ్డు భద్రత కమిటీలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని. మోతె ఎస్సై అజయ్ కుమార్ తెలిపారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్న ప్రాంతంలో పోలీసు చర్యలు చేపట్టి బ్లాక్ స్పాట్స్ గా గుర్తించడం జరిగిందని, మళ్లీ ప్రమాదాలు సంభవించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. రోడ్లపై బ్లాక్ స్పాట్స్ సూచించే సూచిక బోర్డులను వాహనదారులు గమనించాలని నియంత్రణలో వాహనాలు నడపాలని కోరారు.
రోడ్డు భద్రత కమిటీలు గ్రామాలలో పౌరులకు ప్రజలకు అవగాహన కల్పించాలని రోడ్లు దాటే క్రమంలో వాహనాలను గమనించాలని తెలిపారు. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని సీటు బెల్ట్ పెట్టుకోవాలని పరిమితికి మించి ప్రయాణికులను కానీ వస్తువులను కానీ రవాణా చేయడం ప్రమాదకరమని తెలిపారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు ప్రమాదాలకు దూరంగా ఉంటూ సురక్షితంగా గమ్యం చేరుకోవడమే లక్ష్యంగా అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమాన్ని మండల వ్యాప్తంగా నిర్వహిస్తూ ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమం లో వాహన దారులు పోలీసులు తదితరులు పాల్గొన్నారు.