14-07-2025 01:01:41 AM
భద్రాచలం, జులై 13 (విజయ క్రాంతి); భద్రాచల సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించే విషయం అందరికీ తెలిసిందే. 2026 శ్రీరామనవమి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో వినియోగించే కోటి గోటి తలంబ్రాల తయారీకి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, శ్రీరామదాసు భక్త మండలి వారు ఆదివారం వేదబ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల నడుమ వడ్ల పూజ నిర్వహించి అంకురార్పణ చేశారు.ఈ వడ్లను శ్రీమతి& శ్రీ రామదాసు తిరుపతమ్మ- తిరుపతి పుణ్య దంపతులు వారి స్వంత క్షేత్రంలో పలుమార్లు పూజలు నిర్వహించి పండిస్తారు.
ఇలా పండించిన వడ్లను భక్తుల సహకారంతో అత్యంత భక్తిశ్రద్ధలతో గోటితో ఒలిపించి సీతారాముల కల్యాణానికి వినియోగిస్తామని, ఈ కార్యక్రమాన్ని 9 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని రామదాసు తిరుపతి తెలిపారు.కార్యక్రమంలో భాగంగా స్వామివారి సన్నిధిలో పంటకు వినియోగించే విత్తనపు వడ్లకు ఆలయ పూజారులచే పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు టెంపుల్ ఇంచార్జ్ సాయిబాబా, సీసీ శ్రీనివాసరెడ్డి, భక్త రామదాసు పదవతరం వారసుడు కంచర్ల శ్రీనివాసరావు, రామభక్తులు, పాల్గొన్నారు. ఉషారాణి కొమ్మిడి రజిత రెడ్డి విజయ టీచర్ రమ అంజలి మొదలైనవారు పాల్గొన్నారు.