calender_icon.png 14 July, 2025 | 9:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన మాటకు కట్టుబడి ఇందిరమ్మ ఇళ్లు

14-07-2025 01:00:14 AM

వరద బాధితులను నిలువ నీడ కల్పించాం : మంత్రి సీతక్క

మహబూబాబాద్, జూలై 13 (విజయక్రాంతి): భారీ వర్షాలకు వచ్చిన వరద లో ఇల్లు దెబ్బ తిన్న బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిలువ నీడ కల్పిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క ఇచ్చిన హామీ మేరకు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో వరద బాధిత కుటుం బానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.

ఈ మేరకు ఆదివారం నిరుపేద ఠాకూర్ కల్పన నర్సింగ్ దంపతుల ఇంటి నిర్మాణానికి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లం నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. గత ఏడాది జులై లో కురిసిన అతి భారీ వర్షాలకు వరద పోటెత్తి కేసముద్రం పట్టణంలోని హై స్కూల్ సమీపంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.

వరద బాధితులను పరామర్శించడానికి అప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తదితరులు వచ్చి, వరదలో సర్వం కోల్పోయిన ఠాకూర్ నర్సింగ్ కుటుంబాన్ని ఓదార్చారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం లో పక్కా ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

ఆ మేరకు మొదటి జాబితాలోనే నర్సింగ్ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, ఆదివారం ఇంటి నిర్మాణానికి  ముగ్గు పోయడంతో పేద కుటుంబం  ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్లు అయుబ్ ఖాన్, చింతకుంట్ల యాదగిరి, కాంగ్రెస్ నాయకులు పోలేపాక నాగరాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తరాల సుధాకర్, జల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.