23 August, 2026 | 8:27 PM

Breaking News

ప్రభుత్వగిరిజన బాలికల హాస్టల్ లో బోనాల పండుగ   •   దమ్మాయిగూడ–నాగారం 100 ఫీట్ల రోడ్డును 80 ఫీట్లకు కుదించాలి   •   యూరియా కొరత లేదు.... రైతులు ఆందోళన చెందొద్దు   •   శ్రీ రామలింగేశ్వర స్వామి, పార్వతీదేవి అమ్మవార్ల ఉపాలయాల ప్రతిష్ఠా మహోత్సవం   •   మానసిక వికలాంగ విద్యార్థులకు భోజన వితరణ   •   అమ్మవార్ల దయ జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి   •   మైనార్టీ మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అండ   •   ముత్యాలమ్మకి బోనం సమర్పించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి   •   రోడ్డు ప్రమాద బాధితున్ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే   •   సొంత నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం అభినందనీయం: ఎమ్మెల్యే గూడెం   •  

స్వామివారి సేవలో పూనమ్ కౌర్

21-04-2026 02:53 AM

ప్రత్యేక పూజలు నిర్వహించిన సినీ నటి  

వేములవాడ, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేముల వాడలోని ప్రసిద్ధ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయం శ్రీ భీమేశ్వర స్వామిని సినీనటి పూనమ్ కౌర్ సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడి ఆశీస్సులు పొందేందుకు కోడె మొక్కులు సమర్పించిన పూనమ్ కౌర్, దర్శనం అనంతరం ఆలయ మండపంలో అర్చకులు, వేద పండితుల నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ దర్శనం సందర్భంగా ఆలయంలో భక్తులతో కూడిన ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.