23 August, 2026 | 8:52 PM

సొంత నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం అభినందనీయం: ఎమ్మెల్యే గూడెం

23-08-2026 08:01 PM

రామచంద్రపురం ఆగస్టు 23: రామచంద్రపురం మండలం తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని బీహెచ్ఈఎల్ ఎంప్లాయ్ సైబర్ కాలనీలో మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్వర్ తన సొంత నిధులు సుమారు రూ. 7 లక్షల వ్యయంతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి, కాలనీల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, నాయకులు ముందుండడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు.

ప్రజల సౌకర్యార్థం సొంత నిధులతో సీసీ రోడ్లు వేయించడంపై మాజీ కౌన్సిలర్ చిట్టి ఉమేష్వర్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్ శ్రీశైలం, మాజీ కోఆప్షన్ మెంబర్ శ్రీ పాల్ , బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, దేవేందర్ యాదవ్, దయాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి,  ప్రేమ్, శ్రీశైలం, సాగర్, కాలనీ ప్రెసిడెంట్ సంజయ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ మాధవరావు, సెక్రటరీ ఏడుకొండలు, కాలనీవాసులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.