ధరణిపై కలెక్టర్లతో సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్ : ధరణిపై కలెక్టర్లతో సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా మెత్తం పెండింగ్ లో ఉన్న 2.20 లక్షల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెలాఖరులోగా వీలైనన్ని దరఖాస్తులను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ధరణి దరఖాస్తుల్లో పాస్ బుక్ డేటా కరెక్షన్ కోసమే ఎక్కువ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ధరణిలో 188 సాంకేతిక లోపాలు ఉన్నట్లు గుర్తించాం. అందులో 163 సాంకేతిక లోపాలను పరిష్కరించినట్లు నవీన్ మిత్తల్ తెలిపారు. వారం తర్వాత మరోసారి సమీక్షించాలని సీసీఎల్ఏ నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ధరణి దరఖాస్తులు పెండింగ్ లో పెరిగాయి. రంగారెడ్డ జిల్లాలో అత్యధికంగా, అతి తక్కువ ములుగులో పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి. కలెక్టర్లతో పాటు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు ధరణిపై టెక్కికల్ సమస్యలను క్లియర్ చేశాం అని నవీన్ మిట్టల్ వెల్లడించారు.






