10 April, 2026 | 10:43 PM

పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహణ

10-04-2026 09:05 PM

జైనూర్,(విజయక్రాంతి): మండలంలోని గౌరి-1 అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, గ్రామ మహిళలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన సమతుల ఆహారం గురించి వివరించారు.

ముఖ్యంగా ఐరన్, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలు, పచ్చి కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేశారు. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సమతుల ఆహారం చాలా అవసరమని అంగన్‌వాడీ సిబ్బంది సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్, ఆశా వర్కర్లు,  మహిళలు పాల్గొన్నారు.