నంది రామయ్యను పరామర్శించిన ఖానాపూర్ 12వ వార్డు కౌన్సిలర్
10-04-2026 09:03 PM
ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ 12వ వార్డు కౌన్సిలర్, బిఆర్ఎస్ నాయకురాలు, తొడసం ఇందిరా గత కొన్ని రోజుల నుండి అనారోగ్యానికి గురైన సిపిఐ (ఎమ్మెల్) మాస్ లైన్ ప్రజాపంతా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్యను శుక్రవారం పరామర్శించారు. ఆయన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్న రామయ్యను ఇందిరా పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమె వెంట నాయకులు దాదాబాయి, తదితరులు ఉన్నారు.




