calender_icon.png 24 December, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ జిల్లా అధ్యక్షుడిగా పోశన్న కార్యదర్శిగా బంటు భోజన్న ఎన్నిక

24-12-2025 12:00:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిజాంబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం నిజామాబాద్ లో జరిగింది మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిజామాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల దుబ్బ నిజామాబాదులో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు యానం విజయకుమార్ హాజరై నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులుగా ఎ.పోషన్న జడ్.పి.హెచ్.ఎస్  ముదక్ పల్లి నిజామాబాద్ రూరల్.జిల్లా ప్రధాన కార్యదర్శి గా బంటు భోజన్న . కోశాధికారి బి. నాగ రావు దుబ్బ స్కూల్ నిజామాబాద్ అర్బన్* కార్యవర్గ ఎన్నిక అనంతరము ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు ఈ ఈ తీర్మానాలను  ప్రభుత్వానికి నివేదించారు. పెండింగ్ డి ఏ లను విడుదల చేయడంతో పాటు పిఆర్సి నివేదికను బహిర్గతపరిచి అమలు చేయాలనీ 317 బాధితులందరికీ అన్ని కేటగిరీల వారికి న్యాయం చేయాలనీ తమ డిమాండ్లలో పేర్కొన్నారు.

పదవి విరమణ పొందిన వారికి ఆరు కోర్టు డైరెక్షన్ తోటి ఆడిట్ విడుదల చేయాలన్నారు. నెలవారి పెండింగ్ బిల్లులు బిల్లులను విడుదల చేయడంతోపాటు వివిధ కేటగిరి పదోన్నతులు లెఫ్ట్ ఓవర్ వేకెన్సీ లలో పదోన్నతులతో భర్తీ వెంటనే చేయాలనీ ప్రభుత్వానికి నివేదించారు. విద్యార్థుల స్కాలర్షిప్లు అన్ని రకాలైన పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనీ.

టి ఈ టి వాయిదా వేయాడం తోపాటు సంక్షేమ కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని తమ డిమాండ్లలో పేర్కొన్నారుఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గోలి లింగయ్య ఎస్.గంగాధర్ ఎన్.ప్రభాకర్ సుధా గడపాలి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు తాటి సుధాకర్ , జిల్లా బాధ్యులు వై.రాజేశ్వర్ ,పి.రాజేశ్వర్ పి పెద్దన్న  తాటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.