24-12-2025 12:00:00 AM
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలకు చెందిన విద్యార్థులు సిహెచ్.వెన్నెల, పి. మనశ్రీ,ఏ.విష్ణువర్ధన్,ఏ.దుర్గయ్యలు రాష్ట్రస్థాయి సీనియర్ నెట్ బాల్ క్రీడాలకు ఎంపికైన ట్లు కామారెడ్డి జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్,సెక్రటరీ రఘు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎంపికైన క్రీడాకారులు ఈనెల 25 నుండి 27 వరకు మహబూబాద్ జిల్లాలోని కేసముద్రంలో జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడలో పాల్గొననున్నారు.ఎందుకైనా విద్యార్థులకు గోపాల్పేట్ జెడ్పిహెచ్‌ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి,పిడి.సబత్ కృష్ణ అభినందనలు తెలియజేశారు.