calender_icon.png 11 December, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోధన్ డివిజన్‌లో 163 సెక్షన్ అమలు

09-12-2025 12:00:00 AM

పోలీస్ కమీషనర్ సాయి చైతన్య వెల్లడి

నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): ప్రజా శాంతిని కాపాడటానికి మరియు బోధన్ రెవెన్యూ మండలాల్లో ( బోధన్ రూరల్, చందూర్ , కోటగిరి , మోస్రా , పోతంగల్ , రెంజల్ , రుద్రూర్ , సాలూరా , వర్ని , ఏడపల్లి , బోధన్ డివిజన్  నిజామాబాద్ డివిజన్ నవీపేట్) ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పైన పేర్కొన్న  ప్రాంతాలలో U/S 163 BNSS సెక్షన్ అమలులో ఉంటుందని నిజామాబాద్ సిపి తెలిపారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 5 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ప్రజలు గుంపులుగా ఉండకూడదని  ఆదేశించారు.

సంబంధిత అధికారుల నుండి ముందస్తు అనుమతి పొందిన తర్వాత మాత్రమే చట్టబద్ధమైన సమావేశాన్ని నిర్వహించాలనీ తన ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 09.12.2025 ఉదయం 05:00 గంటల నుండి 12.12.2025 సాయంత్రం 05:00 గంటల వరకు అమలులో ఉంటుందని, పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించే వారిపై  చట్ట ప్రకారం చర్యలు కుంటామని నిజామాబాదు పోలీస్ కమీషనర్  సాయి చైతన్య హెచ్చరించారు.