calender_icon.png 11 May, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తపాలా ఉద్యోగులవి అత్యుత్తమ సేవలు..

10-10-2024 06:28:25 PM

20 మంది తపాలా ఉద్యోగులకు ఘన సన్మానం

కరీంనగర్, (విజయక్రాంతి): తపాలా శాఖ ఉద్యోగులు ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నారని లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రతినిధులు పేర్కొన్నారు. జాతీయ తపాలా శాఖ వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం కరీంనగర్ లోని పోస్ట్ ఆఫీస్ మెయిన్ బ్రాంచ్ లో 20 మంది తపాలా శాఖ ఉద్యోగులను లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ ప్రతినిధులు మాట్లాడుతూ.. తపాలా శాఖ ఉద్యోగులు బాధ్యతా యుతంగా విధులు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తూ ఆ శాఖకే మంచి పేరు తెస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి బట్టు వినోద్, ఆర్సీ కొండా రాంబాబు, ప్రోగ్రాం చైర్మన్ లయన్ సింగమరాజు, రాచకొండ సంతోష్, ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.