28-06-2025 12:59:24 AM
చేవెళ్ల, జూన్ 27:శంకర్ పల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో నేడు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అసిస్టెంట్ ఇంజనీర్ టి. ప్రదీప్ కుమార్ తెలిపారు. 33 కేవీ పర్వేద ఫీడర్, 11 కేవీ మాసానిగూడ, పర్వేద, సందీప్ వెంచర్ ఫీడర్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు, లైన్ ఏబీ స్విచ్ ల రిపేరింగ్ కారణంగా శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో పర్వేద, చందిప్ప, మాసాని గూడ, సంకేపల్లి, అంతప్పగూడ, కచిరెడ్డి గూడ, సందీప్ వెంచర్ ప్రాంతాల్లో కరెంట్ ఉండదని, ప్రజలు గమనించి సహకరించాలనికోరారు.