12-07-2025 09:25:22 AM
హైదరాబాద్: సీతారామ ప్రాజెక్టు(Sitarama project) నుంచి నీటి విడుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో(Minister Uttam Kumar Reddy) మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడారు. నాగార్జున సాగర్ నీటి విడుదల(Nagarjuna Sagar water release) ఆలస్యం అవుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో నూ మంత్రి తుమ్మల మాట్లాడారు. ఇవాళ సమీక్ష తర్వాత నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల విజ్ఞప్తి మేరకు మంత్రి తుమ్మల నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, కలెక్టర్లతో మాట్లాడారు.