12-07-2025 08:33:03 AM
హైదరాబాద్: కూకట్ పల్లి కల్తీకల్లు(Toddy Incident) ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. అస్వస్థతకు గురైన మరో ఆరుగురుని గాంధీ ఆస్పత్రి, మరోకరిని నిమ్స్ కు తరలించారు. కూకట్ పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధితుల సంఖ్య 57కి పేరిగింది. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ లో 11 కేసులు నమోదయ్యాయి. కూకట్ పల్లి(Kukatpally) కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నా రు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవ లు అందించాలని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.