calender_icon.png 12 July, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ, అమెరికాల మధ్య సారూప్యత

12-07-2025 02:07:49 AM

  1. అమెరికాతో తెలుగు ప్రజల బంధం బలమైనది
  2. తెలంగాణ-అమెరికా వాణిజ్య సంబంధాల మెరుగునకు ప్రయత్నం
  3. రాష్ట్ర ప్రభుత్వానికి అమెరికా మద్దతు కావాలి
  4. హైదరాబాద్‌లోని కాన్సులేట్‌లో అమెరికా స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 11 (విజయ క్రాంతి): అమెరికా దేశానిది ఎల్లప్పుడూ ఓటమిని అంగీకరించని స్ఫూర్తి అని, బలమైన దేశంగా అనేక అంశాల్లో సానుకూల మార్గంలో పరిష్కారాలను అమెరికా చూపగలిగిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ స్ఫూర్తి కూడా అమెరికా స్ఫూర్తికి ఎంతో సారూప్యత ఉందన్నారు. స్నేహాన్ని కోరుకోవడం, బంధాన్ని మరింత పటిష్టపరచుకోవడం తెలంగాణ ప్రత్యేకత అని స్పష్టం చేశారు.

హైదరాబాద్ లోని కాన్సులేట్‌లో జనరల్-అమెరికా స్వా తంత్య్ర వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందన్నారు. ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా, నిరంతరం ఆవిష్కరణలను అందించడంలో అమెరికా ప్రపంచ దృక్కోణాన్ని మార్చిందని కొనియాడారు. వైఎస్ హయాంలో 2008లో హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ఏర్పాటైందని గుర్తు చేశారు.

భారతదేశంతో దౌత్యపరమైన సంబంధాలను మెరుగుపర్చుకోవడంలో అమెరికా ఎంతో నిబద్ధతను ప్రదర్శించిందన్నారు. అమెరికాతో తెలుగు ప్రజలకు ఉన్న స్నేహపూర్వకమైన బంధం ఎంతో బలమైందని తెలిపారు. అమెరికాలో తెలుగు భాష వేగంగా అభివృద్ధి చెం దుతుందన్నారు. హైదరాబాద్‌లోని కాన్సులేట్ జెన్నిఫర్ లార్సన్ రెండు సంస్కృతుల మధ్య, ప్రజల మధ్య వాణిజ్య పరమైన సంబంధాలను పటిష్టపర్చడంలో బలమైన వారిధిగా నిలుస్తున్నారని అభినందించారు.

ఐటీ, ఫా ర్మా, డిఫెన్స్, మాన్యుఫ్యాక్చరింగ్, ఏరోస్పేస్ రం గాలకు చెందిన దాదాపు 200 అమెరికా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎంతో మంది విద్యార్థు లు తమ కలలను నెరవేర్చుకోవడానికి ఇక్కడి నుంచి అమెరికా వెళ్తున్నారని వెల్లడించారు. అమెరికా-తెలంగాణ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగు పరచడానికి తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా

 తెలంగాణను 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి తెలంగాణ రైజింగ్ దార్శనికతకు కట్టుబడి తమ ప్రభుత్వం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. దీనికి తమకు అమెరికన్ల మద్దతు కావాలని కోరారు. జాతీయ స్థాయిలో పరస్పర విశ్వాసం, విలువల ఆధారంగా అమె రికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందన్నారు.

వ్యాపార, వాణిజ్య రంగాలు, పెట్టుబడులు, ప్రజాస్వామ్యాన్ని విస్తృతం చేయడం, ప్రపంచ శాంతిని నెలకొల్పడం వంటి లక్ష్యాలతో స్నేహపూర్వక బల మైన సంబంధాలు కలిగి ఉండాలని ఇరు దే శాలు కోరుకుంటున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా సైనిక విన్యాసాలు, అంతరిక్ష పరిశోధనలో సహకారం, సాంకేతిక రంగంలో పెట్టుబడులకు సంబంధించిన వాణిజ్యంలో ఇరు దేశాలు రికార్డు నెలకొల్పాయన్నారు.