పవర్‌గ్రిడ్ లాభం రూ.4,137 కోట్లు
23-05-2024 12:05 AM
న్యూఢిల్లీ, మే 22: ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నికరలాభం 2024 మార్చి తో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో 3.5 శాతం క్షీణించి రూ. 4,137 కోట్ల వద్ద నిలిచింది. నిరుడు ఇదేకాలంలో కంపెనీ రూ. 4,288 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయం సైతం 2.5 శాతం తగ్గి రూ. 12,305 కోట్ల నుంచి రూ. 11,978 కోట్లకు చేరింది. బుధవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు షేరుకు రూ.2.75 చొప్పున మధ్యంతర డివిడెండు సిఫార్సుచేసింది. కంపెనీ ఏజీఎం తేదీ నుంచి 30 రోజులలోపు డివిడెండు చెల్లించనున్నట్టు పవర్‌గ్రిడ్ తెలిపింది.






