3 July, 2026 | 10:43 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ప్రారంభం

06-03-2026 04:04 PM

ప్రతిజ్ఞ చేసిన చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, పాలకవర్గ సభ్యులు

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం ఆసిఫాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడం, పట్టణ అభివృద్ధిని వేగవంతం చేయడం, పారిశుధ్యం మెరుగుపరచడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.