22 May, 2026 | 1:49 AM

ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ ఎన్నిక

22-05-2026 01:18 AM

మహబూబాబాద్, మే 21 (విజయక్రాంతి): తెలంగాణ ప్రజా నాట్యమండలి మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా అజ్మీర వేణు, కేదాసు రమేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా 23 మందితో నూతన కౌన్సిల్ ఎన్నుకున్నారు.

మహబూబాబాద్ ప్రజానాట్యమండలి జిల్లా మహాసభలలో నూతన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కట్లోజు పాండురంగ చారి, అధ్యక్షులు అజ్మీర వేణు, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాస్ రమేష్, సహ కార్యదర్శి నీలం వెంకటేశ్వర్లు, మరో సహాయ కార్యదర్శి పసునూరి జంపన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్నమల్ల రవీందర్, ఉపాధ్యక్షులు కొంపెల్లి శ్రీరాములు, కోశాధికారి పులి యాకయ్య, పిడుగు రామ్మూర్తి, సుధాకర్, హరి హరణ్, వీరన్న, చెట్టబోయిన యాకన్న, పద్మ, అలీమా, కేదాస్ కీర్తన, వీరవెల్లి రవి, సాంబలక్ష్మి, వెంకటమ్మ, సరిత, వెలుగు శ్రావణ్ , లాదల్ల వెంకటేశ్వర్లు నియమితులయ్యారు.