22 May, 2026 | 1:50 AM

కామారెడ్డి జిల్లాలో యోగాసన పోటీలు

22-05-2026 01:18 AM

ఉత్సవంగా పాల్గొన్న యోగ సాధకులు

యోగ సాధన తో జీవన విధానాన్ని మారుస్తుంది

కామారెడ్డి, మే 21: (విజయక్రాంతి): యోగ సాధన జీవన విధానాన్ని ప్రవర్తనను ఆరోగ్యాన్ని, మేధస్సును ఉత్తేజపరుస్తూ చురుకుదనంగా ఆరోగ్యాన్ని ఉంచుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా సాధన తో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు గడ్డం రామ్ రెడ్డి అన్నారు.

గురువారం యోగ భవన్లో నిర్వహించిన యోగ యువజన వారోత్సవాల్లో భాగంగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 50 సంవత్సరాల పైబడిన వారు కూడా యోగ పోటీల్లో పాల్గొనడం వారి ఉత్సవాన్ని ఉత్తేజాన్ని అభినందిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజా పాలనలో భాగంగా యువ వారోత్సవాలు పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యోగ భవన్ లో జిల్లా క్రీడ  యువజన అధికారి  ఆధ్వర్యంలో  జిల్లా స్థాయి యోగాసన పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుండి సుమారు 50 మందికి పైగా యోగ క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలను సబ్ జూనియర్, జూనియర్,సీనియర్ కేటగిరీలుగా విభజించి, ఉభయ (పురుషులు, మహిళలు) వర్గాలకు నిర్వహించారు. క్రీడాకారులు తమ ప్రతిభను చాటుతూ ట్రెడిషనల్ యోగ, ఆర్టిస్టిక్ సింగిల్, ఆర్టిస్టిక్ పెయిర్ విభాగాలలో అద్భుతమైన యోగాసన ప్రదర్శనలు చేశారు. విజేతలకు బహుమతుల ప్రధానం చేశారు. పోటీల అనంతరం ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో విజేతలకు మెడల్స్ ప్రశంసా పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, విశిష్ట అతిథులుగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రంగ వెంకటేశ్వర గౌడ్, జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షు లు యోగ రామ్ రెడ్డి, యోగ ప్రతినిధులు కారంగుల సాయి రెడ్డి, జిల్లా యోగాసన ఆర్గనైజింగ్ సెక్రెటరీ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు బద్దం అనిల్ రెడ్డి, ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. యువత శారీరక, మానసిక దృఢత్వానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని, ఇలాంటి పోటీలు క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీస్తాయని కొనియాడారు.

పాల్గొన్న సాంకేతిక నిపుణులు 

ఈ పోటీల నిర్వహణలో టెక్నికల్ అఫీషియల్స్గా శ్రీ రాజ్ కుమార్, హిమబిందు, గోమతి, అజయ్, భరత్, నివాస్, లింగమూర్తి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యోగ సాధకులు, క్రీడాకారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.