‘ప్రజావాణి’ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్‌లో ప్రజావాణికి 106 ఫిర్యాదులు
నిజామాబాద్, మార్చి 30 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్,
దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఏ.సీ.పీ మస్తాన్ అలీలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కామారెడ్డి ప్రజావాణిలో 117 దరఖాస్తులు..
కామారెడ్డి, మార్చి 30 (విజయక్రాంతి): ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు వెంటవెంటనే అధికారులు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ సూచించారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి 114 దరఖాస్తులు వచ్చాయి. ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రజావాణిలో దరఖాస్తు చేస్తే పని అవుతుందని ఆశిస్తారని ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అర్జిదాలలో నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పెండింగ్లో లేకుండా వెంట వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జెడ్పి సీఈవో చందర్ నాయక్, ఆర్డీవో ఎన్ వై గిరి, లు పాల్గొన్నారు. అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల సంబంధించిన వివిధ రకాల సమస్యలపై వచ్చిన ఆర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు ఇస్తూ తక్షణ స్పందించి పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.




