ఎర్రవల్లిలో ప్రతి సోమవారం ప్రజావాణి
17-08-2026 12:00 AM
ఎర్రవల్లి, ఆగస్టు 16: మండల ప్రజల సమస్యలు, ఫిర్యాదులు, వినతుల స్వీకరణకు ప్రతి సోమవారం ఎర్రవల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంట ల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలను అధికారులకు నేరుగా సమర్పించవచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి సూచించారు.






