17 August, 2026 | 1:47 AM

జూరాల నీటిని పొదుపుగా వినియోగించాలి

17-08-2026 12:00 AM

వరికంటే తక్కువ నీటితో పండే పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి: ఎస్‌ఈ డి. కేశవరావు

గద్వాల, ఆగస్టు 16:  ప్రియదర్శిని జూరా ల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం తగ్గుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో సాగునీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్‌ఈ) డి. కేశవరా వు తెలిపారు. రైతులు జూరాల నీటిని పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే పంటలను సాగు చేయాలని సూచించారు.

జూరాల ప్రాజెక్టు నీటి పరిస్థితి, రైతుల పంటల అవసరాలపై ఎస్‌ఈ డి. కేశవరావు ఆధ్వర్యంలో ఆదివా రం నీటిపారుదల శాఖ అధికారులు, కార్యనిర్వాహక ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులో కి వస్తున్న నీటి ప్రవాహం, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ఆయకట్టు పరిధిలో పం టల సాగు పరిస్థితిపై చర్చించారు.

రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున సాగునీటి లభ్యతపై ముం దస్తు చర్యలు తీసుకోవాలన్నారు. జూరాల ప్రాజెక్టుకు నీటి ప్రవాహం మరింత తగ్గిన వెంటనే ముందస్తు చర్యల్లో భాగంగా కాలువలను మూసివేస్తామని తెలిపారు.