20 April, 2026 | 9:14 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జారే

20-04-2026 08:11 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలో మహిళా సంఘాల ద్వారా పూసుగూడెం, సీతాయిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, రైతులు పండించిన పంటలకు మద్దతు ధరతో పాటుగా సన్నరకం వడ్లకు 500/-బోనస్ ఇస్తుందన్నారు. రైతు సోదరులు ప్రభుత్వం ప్రకటించిన నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యంను ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు  తీసుకొని వచ్చి మద్దతు ధరను పొందాల్సిందిగా తెలిపారు. తెలియచేసినారు.