21 July, 2026 | 12:35 PM

కలెక్టరేట్‌లో ప్రజావాణి

21-07-2026 01:05 AM

నిర్మల్ జులై 20 ( విజయ క్రాంతి)ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఆలస్యం చేయకూడదని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వ యంగా స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ఆయా శాఖల అధికారులు ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచిం చారు.

మండలాల వారీగా పెండింగ్ లో ఉ న్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా, ప్రజలు విద్య, వైద్యం, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను అదనపు కలెక్టర్ కు సమర్పించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్‌ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.