21 July, 2026 | 12:34 PM

అసైన్డ్ భూములకు హక్కులు కల్పించాలి

21-07-2026 01:05 AM
  1. దళిత బంధుతోపాటు అభివృద్ధిని అమలు చేయాలి 
  2. స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కోరిన మాజీ మంత్రి మోత్కుపల్లి 

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమా ర్‌ను మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు సోమవారం మర్యాదపూర్వకంగా క లిశారు.  స్పీకర్ దృష్టికి మాజీ మంత్రి నరసింహులు పలు సమస్యలు తీసుకెళ్లారు. ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేసేలా చూడాలని మోత్కుపల్లి కోరారు. ప్రధానంగా దళిత బంధు, ఎస్సీ వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములపైన చర్చించారు.

గతంలో దళితులకు ఇచ్చి న అసైన్డ్ భూములే ఉన్నాయని, వాటిని వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరు తో ప్రభుత్వాలు తీసుకుంటున్నాయాని తెలిపారు. తద్వారా దళితులకు భూములు లే కుండా పోతున్నాయని మోత్కుపల్లి వివరించారు.  అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కల్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. మాదిగ మహాశక్తి నాయకులు, ప్రొ ఫెసర్ గుండెడప్పు కనకయ్య, సీనియర్ నా యకులు ముంజగల్ల విజయ్‌కుమార్, ప్ర శాంత్‌కుమార్, స్పెన్‌రెడ్ తదితరులున్నారు.