26 July, 2026 | 5:43 AM

ప్రజ్వల్‌కు పోలీస్ కస్టడీ

01-06-2024 02:33 AM

జూన్ 6వ తేదీ వరకు కస్టడీ విధించిన కోర్టు

కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో అరెస్టు చేసిన సిట్ 

అరెస్టు చేసిన బృందంలో అందరూ మహిళలే

సెక్స్ వీడియోలు, లైంగిక వేధింపుల వ్యవహారంలో ప్రజ్వల్‌పై తీవ్ర ఆరోపణలు

బెంగళూరు, మే 31: లైంగిక వేధింపులు, సెక్స్ వీడియోల కేసులో జర్మనీకి పారిపోయి భారత్‌కు వచ్చి ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జూన్ 6వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి పం పారు. గురువారం అర్ధరాత్రి బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగగానే సిట్ పోలీసులు ప్రజ్వల్‌ను సిట్ బృందంలోని ముగ్గురు మహిళా పోలీసు అధికారులు అరెస్టు చేశారు. ఆ వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టు ముం దు ప్రవేశ పెట్టారు. ప్రజ్వల్‌ను విచారించేందుకు 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా, వారం రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది.

సంచలనం సృష్టించిన వీడియోలు.. 

దాదాపు 400 మందిపై లైంగిక దాడులకు పాల్పడ్డాడని, సెక్స్ వీడియోలు కూడా వందల సంఖ్యలో ఉన్నాయని ప్రజ్వల్ రేవణ్ణపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వందల సంఖ్యలో వీడియోలు లీక్ కావడంతో కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సంచలనమైం ది. దీంతో ఈ వ్యవహారంలో విచారణ జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ వెంటనే ప్రజ్వల్ రాత్రికి రాత్రే జర్మనీకి పారిపోయాడు.

ఇదే కేసులో ప్రజ్వల్ తండ్రి రేవణ్ణకు కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రజ్వల్ నుంచి జర్మనీ నుంచి  రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండాపోయింది. చివరకు మాజీ ప్రధాని, ప్రజ్వల్ తాత దేవేగౌడ హెచ్చరించే సరికి భారత్‌కు వచ్చాడు. తాను భారత్‌కు వస్తున్నట్టు వీడియో కూడా విడుదల చేశాడు. బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో దిగగానే సిట్ అధికారులు అరెస్టు చేశారు.