19-10-2025 12:00:00 AM
-నివాళులర్పించిన ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సాయి చైతన్య
- రౌడీ షీటర్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్
-రియాజ్‌పై 50 వేల రివార్డు ప్రకటించిన పోలీస్ శాఖ
నిజామాబాద్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): రౌడీ షీటర్ కత్తిపోటు గురై ప్రాణా లు కోల్పోయిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమో ద్ అంత్యక్రియలను జిల్లా పోలీస్ శాఖ అధికార లాంఛ నాలతో నిర్వహించింది.ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్యలు ప్రమోద్ అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో అడి షనల్ డీసీపీ బసవరెడ్డి, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు, బంధువులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.కాగా నిజా మాబాద్ లో పాత నేరస్తుడు రియాజ్‌ను బైక్‌పై తీసుకెళ్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లపై అ తను కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ ప్రమోద్ మృతిచెందగా, మరో కాని స్టేబుల్ విఠల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. వినాయకనగర్ ప్రాంతంలో పలు కేసుల్లో నిందితుడైన రౌడీ షీటర్ రియాజ్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
రియాజ్‌పై రూ.50 వేల రివార్డు
నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్‌ను కత్తితో పొడిచి చంపిన రౌడీ షీటర్ రియాజ్ సమాచారం అందించిన వారికి రూ.50 వేల బహుమతిని పోలీస్‌శాఖ ప్రకటించింది. షేక్ రియాజ్ తండ్రి పేరు మహ్మద్ వయసు 24 సంవత్సరాలు. నగరంలోని అహ్మర్‌పుర కాలనీకి చెందినవాడు. సమాచారం తెలిసినవారు పోలీసులకు డయల్100 లేదా 872659793, 8712659777 ఫోన్లకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నిజామాబాద్ పోలీస్ శాఖ తెలిపింది.