calender_icon.png 19 October, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో తండ్రిని చంపిన కొడుకు

19-10-2025 12:00:00 AM

-వారిద్దరి మధ్య చెలరేగిన వివాదం

-గుర్తు తెలియని ఆయుధంతో తండ్రిపై దాడి

-జన్నారం మండల కేంద్రంలో ఘటన

జన్నారం, అక్టోబర్ 18 (విజయక్రాంతి): మద్యం మత్తు లో తండ్రిని కొడుకు హత్య చేసిన సంఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం జ న్నారం జీపీ పరిధిలోని సేవాదాస్ నగర్‌కు చెందిన జాదవ్ శంకర్ నాయక్ (50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని కొడుకు నూర్ సింగ్ మద్యానికి బానిసై రోజు తాగి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు.దీంతో అతని భార్య పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.

శనివారం నూర్ సింగ్ కు, శంకర్ నాయక్ మధ్య వివాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నూర్ సింగ్ గుర్తు తెలియని ఆయుధంతో శంకర్ నాయక్ తల వెనుక భాగంపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు, బంధువుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టామన్నారు. నూర్ సింగ్ పరారీలో ఉన్నాడని, శంకర్ సింగ్ కుమార్తె భూక్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.