calender_icon.png 19 October, 2025 | 3:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

68 మంది ఎస్‌ఆర్ విద్యార్థులకు మెడికల్ సీట్లు

19-10-2025 12:00:00 AM

సన్మానించిన ఎస్‌ఆర్ విద్యా సంస్థల ప్రతినిధులు

మేడ్చల్, అక్టోబర్ 18 (విజయక్రాంతి): ఎస్‌ఆర్ విద్యాసంస్థలకు చెందిన 68 మంది విద్యార్థులు రాష్ట్రంలోని వివిధ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించారు.2023--25 విద్యా సంవత్సరంలో రెగ్యులర్ ఇంటర్, కోచింగ్ తీసుకున్న విద్యార్థులు నీట్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. వీరిని హైదరాబాద్ మల్లంపేట్ లోని ఎస్‌ఆర్ క్యాంపస్ నందు ఎస్‌ఆర్ విద్యాసంస్థల ప్రతినిధులు సన్మానించారు.

విద్యార్థులను ఎస్‌ఆర్ విద్యాసంస్థల చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి, నీట్ కోఆర్డినేటర్ సుధాకర్, డీజీ ఎంలు భగవాన్ రెడ్డి, వాసుదేవా రెడ్డి, కోర్డిన్ శ్రీనివాస్ అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ వరదా రెడ్డి మాట్లాడుతూ నీట్ లో అత్యుత్తమ కోచింగ్‌తోపాటు సీనియర్ ఆధ్యాపకుల బోధన, వారాంతపు పరీక్షలు, స్టడీ అవర్స్, విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయ డం వంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపకులు పాల్గొన్నారు.