3 July, 2026 | 11:27 PM

Breaking News

బెల్లంపల్లి ఐటీడీఏ నర్సరీకి పూర్వవైభవం   •   పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •  

సిట్ విచారణకు హాజరైన ప్రణీత్ రావు

18-06-2025 01:25 PM

హైదరాబాద్: హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్ విచారణ(SIT Inquiry) కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించి అరెస్టు చేసిన సిట్.. వారి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రణీత్ రావు(Praneeth Rao) బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. 

ఎన్నికల ముందు ఎస్ఐబీలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ను లీడ్ చేసిన ప్రణీత్ రావు రాజకీయ నేతలు, ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేశాడు. ప్రభాకర్ రావు ఆదేశాలతో హార్డ్ డిస్కులను ధ్వంసం చేసి నాగోల్ వద్ద మూసీ నదిలో పడేసినట్లు ప్రణీత్ రావు సిట్ అధికారులకు వెల్లడించారు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డితో పాటు మిగిలిన సాక్షుల వాంగ్మూలాలను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న జుబ్లీహిల్స్ లోని సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు.