కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
బ్రిడ్జి పనుల్లో ఉన్న కార్మికుడు దుర్మరణం
పెద్దమందడి, ఆగస్టు 11 (విజయక్రాంతి): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బుర్రవాగు స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి-44పై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెన నిర్మాణ పనుల్లో ఉన్న బీహార్కు చెందిన వలస కార్మికుడిని వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదం అనంతరం కారు అదుపుతప్పి బ్రిడ్జి మధ్యలో బోల్తా పడగా, అందులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దమందడి ఎస్‌ఐ పి. జలంధర్రెడ్డి తెలిపారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణమా అనే కోణంలో విచారణ కొనసాగుతోందన్నారు.






