సెప్టెంబర్ 1లోపు పీఆర్సీ ప్రకటించాలి
- లేకుంటే ఆ తర్వాతే ఉద్యమమే!
- టీచర్స్ జేఏసీ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): సెప్టెంబర్ 1లోపు పీఆర్సీ ప్రకటించాలని, లేనట్లయితే ఆతర్వాత ఉద్యమం తప్పదని ఎమ్మెల్సీ పింగలి శ్రీపాల్ రెడ్డి హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కార్యాలయంలో టీటీజేఏసీ చైర్మ న్ పుల్గం దామోదర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీఆర్సీ ఇప్పటికే మూడే ళ్లు ఆలస్యమైందని, ఇక ఊరుకునే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు.
ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 1 వరకు అన్ని ఆస్పత్రుల్లో నగ దు రహిత చికిత్స అమలు చేయాలని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపచేయాలని, సర్వీస్ రూల్స్ అమలు చేసి విద్యావ్యవస్థను పటిష్టపరచాలని కోరారు. సమావేశంలో పీఆర్టీయూ టీఎస్ ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, గెజిటెడ్ హెచ్ ఎం అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రాజగంగారెడ్డి, గిరిధర్‌గౌడ్, టీఆర్టీ ఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేష్, ఎం అంజిరెడ్డి, ఆయూపీపీ నాయకులు క్రాంతికృష్ణ తదితరులు పాల్గొన్నారు.






