మంథని డిగ్రీ కళాశాలలో ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలు..
మంథని మార్చి 18 (విజయ క్రాంతి): స్థానిక ముంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ, తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలను నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరిషయ్య మాట్లాడుతూ తెలుగువారి నెలలు చైత్రమాసంతో మొదలై ఫాల్గుణ మాసంతో ముగుస్తుందని, తెలుగువారికి మొదటి పండుగ ఉగాదితో ప్రారం భమవుతుందని, ఇదే యుగానికి ఆరంభంగా ఉందని పురాణాలు చెబుతున్నాయని , అందరూ ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
కళాశాల తెలుగు విభాగం అధ్యాపకురా లు మానస, మాట్లాడుతూ ఉగాది పండుగ విశిష్టతలైన ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవ ణం గురించి, ఈ పరాభవ నామ సంవత్సర విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఉగాది పచ్చడి, భక్షాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కో ఆర్డినేటర్ కృష్ణ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డా. లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫె సర్ సతీష్, అధ్యాపకులు అమర్నాథ్, ము కుందం, ఫర్జానా, రజిత, దుర్గం కృష్ణ, శేఖర్, శ్రీధర్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.




