కొంగరకలాన్‌లో ప్రీమియం విల్లాలు
- ప్రారంభించిన రామానుజ చిన జీయర్ స్వామి
- ఫ్యూచర్ సిటీకి అనుబంధంగా ఆర్క్ అర్థ, ఆర్క్ ఆర్యమా విల్లాలు
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): విలాసవంతమైన నివాస జీవితానికి, ప్రశాంతమైన, విశాలమైన వాతావరణానికి అనువైన ప్రాంతంలో ఆర్క్ అర్థ, ఆర్క్ ఆర్యమాలతో ప్రీమియం విల్లాల(premium villas)ను నిర్మిస్తుంది. కొంగరకలాన్(Kongarakalan)లో ఈ సంస్థ నిర్మించి న ప్రీమియం విల్లాల సముదాయాన్ని రామానుజ జీయర్ స్వామి(Ramanuja Jeeyar Swamy) ఆదివారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్క్ గ్రూప్ సీఎండీ జీ రామ్‌రెడ్డి, సీఈవో మేఘనా గుమ్మిలు మాట్లాడుతూ.. ఆర్క్ అర్థ, ఆర్క్ ఆర్యమా గ్రూప్ నిర్మించిన ఈ విలాల్లో ప్రకృతి, విశాలమైన జీవనం, ప్రపంచస్థాయి సౌకర్యాలను ఒకచోట చేర్చామన్నారు.
కొంగరకలాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని పేర్కొన్నారు. ఎయిర్‌పోర్ట్, పారిశ్రామిక జోన్, నివాస, విద్యా, ఆరోగ్య, సంరక్షణ, వినోదం, ఫ్యూచర్ సిటీకి దగ్గరగా తమ ప్రాజెక్టులో విల్లాలు తీసుకున్న వారు ప్రయోజనం పొందవచ్చన్నారు. మె ట్రో ఫేజ్-2 విస్తరణ, బుల్లెట్ ట్రైన్ హబ్, ఇతర మౌలిక సదుపాయాలు తాము నిర్మించబోయే విల్లాలకు అతి దగ్గరగా ఉన్నాయ న్నారు. కొంగరకలాన్ అభివృద్ధికి వ్యూహాత్మక ప్రదేశంగా అభివర్ణించారు. ప్రకృతితో మమేకమైన ప్రత్యేక జీవనశైలిని మమే కం చేసేలా విల్లాలను కొనుగోలుదారులకు అందజేస్తామని సీఎండీ జీ రామ్‌రెడ్డి, సీఈవో మేఘనా గుమ్మిలు వివరించారు.






