సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మార్చి 24(విజయక్రాంతి): వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడి నివారణకు మెదక్ జిల్లాలోసమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో సమావేశ హాల్లో మిషన్ భగీరథ, ఇంట్రా గ్రిడ్, గ్రిడ్, ఇరిగేషన్, ఫారెస్ట్, ఆర్డబ్ల్యూఎస్ గ్రామపంచాయతీ, గ్రౌండ్ వాటర్, మున్సిపల్ కమిషనర్స్, వివిధ శాఖల అధికారులతో వేసవికాలంలో త్రాగునీటిసమస్య లు తలెత్తకుండా ముందస్తు చర్యలు పై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా జిల్లాలో గ్రామాలలో ప్రజలకు త్రాగునీటి సమస్యను తలెత్తకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ ద్వారా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. వే సవిలో జిల్లాలోని 917 హ్యాబిటేషన్లలో నివసిస్తున్న 1,76,170 కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు.జిల్లాలో ఉన్న 1485 తాగునీటి ట్యాంకులను శుభ్రం చేయాలని తెలిపారు.
తాగునీటి సరఫరా అంశం అత్యంత కీలకమైనదని, క్షేత్రస్థాయిలో ప్రతి రోజూ పకడ్బందీగా పర్యవేక్షణ జరగాలని సూచించారు. మౌలిక సదుపాయాలు: బోర్ వెల్స్ మరమ్మతులు, ట్యాంకుల క్లీనింగ్ పనులను తక్ష ణమే పూర్తి చేయాలన్నారు. ఎక్కడైనా నీటి ఎద్దడి తలెత్తిన వెంటనే యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, అవసరమైన చోట చేతిపంపులు, బోరు మోటార్లు, పైజైన్ మరమ్మతులు సకాలంలో పూర్తి చే యాలని తెలిపారు. అవసరమైతే గ్రామపంచాయతీ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని సూచించారు.
మిషన్ భగీరథ ద్వారా నిర్ణీత పరిమాణంలో నీరు సరఫరా అవుతోందో లేదో మండల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు నిర్ధారించుకోవాలని తెలిపారు. సంబంధిత శాఖల అధికా రులు పరస్పర సమన్వయంతో పని చేస్తూ ఈ వేసవిలో ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి సమస్య తలెత్తకుండా నిబద్ధతతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఎఫ్.ఓ జోజి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్ ఈ..ఈ సంపత్ కుమార్, గ్రిడ్ నాగభూషణం, సంబంధిత మున్సిపల్ కమిషనర్స్, గ్రౌండ్ వాటర్ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




