25 March, 2026 | 2:10 AM

కాచపూర్‌లో మహిళా సంఘ భవనానికి భూమిపూజ

25-03-2026 12:00 AM

భిక్కనూర్, మార్చి 23 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం కాచపూర్ గ్రామంలో మహిళా సంఘ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, సర్పంచ్ జ్యోతి సంతోష్ గౌడ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి లింగాల రాజాబాబు గౌడ్, ఉప సర్పంచ్ దశరథం, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు, నాయకులు కిష్ట గౌడ్, గాల్ రెడ్డి, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.