హరితహారానికి సిద్ధం
ఈ ఏడాది వికారాబాద్ జిల్లా లక్ష్యం 40.53లక్షలు
ప్రభుత్వ శాఖల వారీగా 80శాతం మొక్కలు రక్షించేలా ప్లాన్
వికారాబాద్, మే 26 (విజయక్రాంతి) : జిల్లాలో 9వ విడత హరితహారం కార్యక్రమానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికల హడావుడి ముగియడంతో పాలనా, సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. వానాకాలం సమీపిస్తుండడంతో మొదట హరితహారం కార్యక్రమా నికి ప్రాధాన్యత ఇవ్వనుంది. గతేడాదిలాగే ఈ సారి కూడా 19 ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో హరితహారానికి రూపకల్పన చేస్తు న్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ ఇప్పటికే పలు శాఖల అధికారులతో సమీక్షించి, లక్ష్యాలను కూడా నిర్ధేశించారు. హరితహారం విజయవంతం గా నిర్వహించేందుకు అన్ని శాఖలను సన్నద్ధం చేస్తున్నారు.
80శాతం మొక్కలు బతకాలి..!
కొన్నేళ్లుగా రాష్ట్రంలో హరితహారం కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున్న మొక్కలు నాటేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. వికారాబాద్ జిల్లా లో 40,53,500 మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది 40.54 లక్షల మొక్కల టార్గెట్‌ను దాదాపుగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. వీటిలో 80శాతం మొ క్కలు బతికాయని అధికారులు చెబుతున్నా 50 నుండి 60శాతం వరకు బతికుంటాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ సారి కచ్చితంగా 80శాతం మొక్కలను కాపాడడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.






