ఉచిత స్కూల్ బస్సు బహూకరణ
హెలెన్ కెల్లర్స్ పాఠశాలకు ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అందజేత
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ ఫౌం డేషన్ (సీఎస్‌ఆర్) ఆధ్వర్యంలో హెలెన్ కెల్ల ర్స్ దివ్యాంగుల పాఠశాలకు ఉచిత స్కూల్ బస్సును బహుకరించారు. బధిరులు, మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులకు సురక్షిత మైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యం తో ఈ బస్సును అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్‌ఐసీ ఆఫ్ ఇండి యా సౌత్ సెంట్రల్ జోనల్ మేనేజర్ సరవణ రమేష్ హాజరై, పాఠశాల యాజమా న్యానికి బస్సు తాళాలను అందజేశారు. అ నంతరం పాఠశాలను సందర్శించి, కేజీ నుం చి డిగ్రీ వరకు దివ్యాంగ విద్యార్థులకు ఒకే ప్రాంగణంలో నాణ్యమైన విద్య, శిక్షణ, పునరావాస సేవలు అందిస్తున్న సంస్థ సేవలను అభినందించారు.
హెలెన్ కెల్లర్స్ దివ్యాంగుల పాఠశాల చైర్మన్ పటాన్ ఉమర్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ ఉచిత బస్సు వల్ల డే స్కాలర్ విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని, వారి విద్యాభ్యాసం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ఎల్‌ఐసీ గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్కు ఆయన ప్ర త్యేక కృతజ్ఞతలు తెలిపారు. సరవణ రమేష్ మాట్లాడుతూ, ‘దివ్యాంగులకు సానుభూతి మాత్రమే కాదు, వారి జీవితాలను మార్చగల అవకాశాలు, చేయూత అందించడం మా సంస్థ లక్ష్యం’ అన్నారు. కార్యక్రమంలో ఎల్‌ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రభాత్ కుమార్ సాహూ, మార్కెటింగ్ మేనేజర్ ఎం. ప్రసాద్ రావు, రీజనల్ మేనేజర్ డి.జె. శ్రీనివాస్ (సీసీ జోన్, హైదరాబాద్), పాఠశాల డైరెక్టర్ ఆరుముగం, ప్రిన్సిపాల్ శశిధర్‌రెడ్డి, కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.






