స్కూల్ పాలకవర్గం ఏక గ్రీవ ఎన్నిక
ఆర్‌బివిఆర్‌ఆర్ హైస్కూల్‌లో ఏర్పాటు
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): నిజామాబాద్‌లోని ఆర్‌బివిఆర్‌ఆర్ హైస్కూల్‌కు 2026 సంవత్సరానికి కొత్త స్కూ ల్ పాలకవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్కూల్ ప్రెసిడెంట్‌గా యం.సుదీ క్షణ శేఖర్, స్కూల్ హెడ్ బాయ్‌గా కె. అమ ర్త్య, హెడ్ గర్ల్‌గా జి. మహీరారెడ్డి ఎన్నికయ్యా రు.
ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి చైర్‌పర్సన్‌గా పి. జగదీశ్, హాస్టల్ కమిటీ చైర్ పర్సన్‌గా ఎ అమోఘితరెడ్డి, జాయింట్ సెక్రట రీగా ఈసి మొయింద్దీన్, విద్యాకమిటీ సభ్యులుగా పలువురు విద్యార్థులు బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి స్కూల్ అడ్వైజర్ హెడ్ మాస్టర్, అధ్యాపక బృందం, విద్యార్థులు హాజరయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులు విద్యార్థుల సమస్యల పరిష్కా రానికి కృషి చేస్తామని, పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు.






