ఐబీఎం ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్ల ప్రదానం
జేపీఎన్‌సీఈ కాలేజీలో డిప్లమో విద్యార్థులకు అందజేత
అభినందించిన కళాశాల చైర్మన్ కేఎస్ రవి కుమార్
మహబూబ్ నగర్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): స్థానిక జయప్రకాశ్ నారాయణ ఇం జనీరింగ్ కళాశాలలో ఐబీఎం సంస్థ ద్వారా ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకున్న డిప్లొమా విద్యార్థులకు కళాశాల సెమినార్ హల్‌లో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ ము ఖ్య అతిథిగా విచ్చేసారు.
ఆరు నెలలుగా జరిగిన ఈ శిక్షణలో విద్యార్థులు ఐదు సర్టిఫికేష న్లు, ఇంటర్న్‌షిప్‌కేషన్స్ పూర్తి చేసుకున్నారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ ఐబీఎం సంస్థతో ఒప్పందం కుదుర్చుకొన్న రాష్ట్రం లో మొట్టమొదటి కళాశాల జేపీఎన్‌సీఈ అని, దీని ద్వారా బీటెక్ విద్యార్థులకు శిక్షణ, డిప్లొమా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్ అందించడం తమకెంతో గర్వంగా ఉందని పేర్కొం టూ ఇంటర్న్‌షిప్స్ పూర్తి చేసుకున్న విద్యార్థులను అభినందించారు.
టీసీఎస్ కంపెనీ ద్వా రా నలుగురు బీటెక్ విద్యార్థులు ఎంపికైన విషయం గుర్తు చేశారు. అకాడమిక్స్‌తోపాటు టీసీఎస్ ఐవోన్, ఐబీఎం, ఎన్‌ఎక్స్‌టీ వేవ్, టీఏఎస్‌కె సంస్థ ల ద్వారా శిక్షణ, త ద్వారా క్యాంపస్ ప్లేస్‌మెంట్‌ల ద్వారా విద్యార్థులు పలు కంపెనీలకు ఎంపికవుతు న్నార న్నారు. పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్ట ర్ వీఈ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ డా క్టర్ పి.కృష్ణమూర్తి, ఈఈఈ, మెకానికల్ విభాగాధిపతులు ఏ. స్వాతి, సీహెచ్ వెంకటేష్, ఎం. రవీందర్, అధ్యాపకులు, విద్యార్థులున్నారు.






