calender_icon.png 14 July, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ రఘునందన్ రావును కలిసిన ప్రెస్ క్లబ్ నాయకులు

13-07-2025 04:34:14 PM

ముప్పిరెడ్డిపల్లిలోని జర్నలిస్ట్ లకు ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తా..

మంత్రి వెంకటస్వామినీ కలిసి మంజూరి చేయిస్తా..

ఉమ్మడి తూప్రాన్ మండల విలేకరులకు ఎంపీ హామీ..

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao)ను తూప్రాన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కంఠాయపాలెం వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గైనిభైటి భాస్కర్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ లయన్ డాక్టర్ జానకిరామ్ సిఆర్ బీజేపీ నాయకులు కలిసి ముప్పిరెడ్డిపల్లిలోని జర్నలిస్ట్ లకు ఇళ్ల నిర్మాణానికి జిల్లా కలెక్టర్ కు, జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామినీ కలిసి మంజూరి చేయిస్తా అని ఉమ్మడి తూప్రాన్ మండల విలేకరులకు ఎంపీ హామీ ఇచ్చారు.

కాగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావును మర్యాదపూర్వకంగా తూప్రాన్ ప్రెస్ క్లబ్ నాయకులు ఆదివారం కలిసి పరామర్శించారు. గత వారం రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో శస్త్ర చికిత్స అనంతరం కోకాపేటలోని అతని స్వగృహంలో కలిసి ప్రజా క్షేత్రంలో సేవ చేయడానికి తొందరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ తెలిపారు. శాస్త్ర చికిత్స అనంతరం శనివారం ఉదయం కుట్లు ఇప్పి ఇంటికి చేరుకున్న విషయం తెల్సుకుని ఎంపీనీ తూప్రాన్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు భూమన్నగారి జానకిరామ్ గౌడ్ తో కలిసి తూప్రాన్ ప్రెస్ క్లబ్ నాయకులు ఎంపీ నీ పరామర్శించారు.