calender_icon.png 14 July, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మల్లన్న కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం

13-07-2025 04:37:29 PM

వెనుకనున్న సూత్రధారులను అరెస్ట్ చేయాలి..

బీసీ పొలిటికల్ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు వైద్యుల సత్యనారాయణ..

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ పొలిటికల్ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు వైద్యుల సత్యనారాయణ ఆదివారం పేర్కొన్నారు. ఈ దాడికి వెనుకనున్న సూత్రధారులను కూడా అరెస్టు చేసి శిక్షించాలని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడి యావత్ బీసీ సమాజంపై దాడిగా పరిగణిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే దాడి ఘటనకు సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షించి ఈ దాడిపై సిబిఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. బీసీలపై ఈ దాడులు ఇలాగే కొనసాగితే రాబోవు పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి వస్తుందని ప్రజాస్వామ్య సమాజంలో భౌతిక దాడులకు తావులేదని వ్యక్తుల పట్ల భిన్నభిప్రాయాలు ఉంటే ఒకరికి ఒకరు లేదా పత్రికల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు.