ఆపత్తుల నివారణ పాలకుల బాధ్యత
పాలకుర్తి రామమూర్తి :
దైవాన్యష్టౌ మహాభయాని
అగ్నిః, ఉదకం, వ్యాధిః, దుర్భిక్షమ్,
మూషికాః, వ్యాలాః, సర్పాః రక్షాంసీతి,
తేభ్యో జనపదం రక్షేత్!
(కౌటిలీయం - 4-3)
రాజ్యపాలన బాధ్యతయే కాని హ క్కుకాదు. ప్రజల భద్రత, రక్ష ణ, అభ్యుదయం ఆదర్శవంతులైన పాలకుల కర్తవ్యం. రక్షణ శత్రువుల నుండి మా త్రమే కాదు.. ప్రజలను పీడించే దైవికమైన ఎనిమిది మహాభయాలు.. అనగా అగ్ని, నీరు, వ్యాధులు, కరువు కాటకాలు, ఎలుకలు, క్రూరజంతువులు, సర్పాలు, రాక్షసు లు.. వీటి నుండి కూడా ప్రజలను రక్షించాలి అంటున్నాడు ఆచార్య చాణక్య. వీటికి అదనంగా యుద్ధాలనూ చేర్చాలి.
చాణక్య యుద్ధాలను చివరి అస్త్రంగా చెపుతూ... అభిప్రాయ భేదాలను వ్యూహాత్మకంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం, గూఢచార వ్యవస్థను పటిష్టపరచుకొని ముందు గా ఆపత్తులను పసిగట్టి అవసరమైన జాగ్ర త్త చర్యలను చేపట్టడం ద్వారా నష్టతీవ్రతను తగ్గించుకోవాలని చెపుతాడు.
అలాగే సమాన అవసరాలు గలిగిన మిత్రదేశాలతో మైత్రిని పెంచుకోవడం ఉత్తమంగా చెపుతాడు. ఒక్కొక్కమారు ముందు జాగ్ర త్త చర్యలెన్ని తీసుకున్నా.. ఊహించని విధంగా ఎదురయ్యే ఆపత్తులను ధైర్య సాహసాలతో ఎదుర్కొనడమే పరిష్కారం. మహాభయాలను అధిగమించేందుకు ప లు మార్గాలను సూచించాడు చాణక్య.
అగ్నిని ఆరాధించడం, అగ్ని మాపక ద ళాలను ఆధునీకరించడం చేత అగ్ని ప్రమాదాలను నివారించాలి. వర్షాకాలంలో వర దలు వచ్చే నదుల ఒడ్డులను పటిష్టం చే యడం, వరదలు వచ్చే ప్రాంతాల ప్రజలకు దూరంగా ఆవాసాలు కల్పించడం, ముందుగానే అవసరమైన వెదురు కఱ్ఱలను, ఇసుక బస్తాలను సంగ్రహించుకొని నదులు, చెరువు కట్టలను పటిష్టపరచడం, అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నావలను సన్నద్ధం చేసిపెట్టడం, అధికార యంత్రాంగాన్ని, ప్ర జలను అప్రమత్తం చేయడం ద్వారా వరదల ప్రమాదాన్ని అరికట్టాలి. అలాగే గడ్డినీ ఔషధాలను సేకరించి పశుసంతతినీ అంటువ్యాధుల బారిన పడకుండా రక్షించాలి. దుర్భిక్షం (కరువుకాటకాలు) సమ యంలో రాజు విత్తనాలు, ఆహారం సరఫరా చేయించి ప్రజలను ఆదుకోవాలి.
పనికి ఆహారాన్ని సమకూరుస్తూ దుర్గానికి సంబంధించిన పనులనూ, సేతువుల నూ, పూడికలు తీయించడం లాంటి పనులను చేయించాలి. ఆహార భద్రతను సాధి ంచాలి.. అలా కుదరని పక్షంలో మిత్రులైన పరదేశ పాలకులను అర్థించైనా తన ప్రజలను రక్షించాలి. అలాగే ఎలుకలు పొలా లలో పంటలను, ఇళ్ళలో ఆహారపదార్ధాల ను నాశనం చేయడమే కాక పలు రోగాలకు కారణమౌతాయి. ఎలుకలు ప్రబల కుండా చర్యలు చేపట్టాలి.
‘స్నుహి‘ (పాలజెముడు) అనే మొక్కల పాలుపూసిన ధా న్యపు గింజలు చల్లితే.. వాటిని తిన్న ఎలుకలు మరణిస్తాయని చెపుతాడు, చాణక్య. వాటితో పాటుగా మిడతలు, పక్షులు, పు రుగులు కూడా మరణిస్తాయంటాడు. క్రూ రమృగాలను (వ్యాలాః) నివారించడానికి ఆయుధధారులైన వారిని శిక్షణనిచ్చి నియమించాలి.
క్రూరమృగాలను చంపినవారికి పారితోషికం ఇవ్వాలంటారాయన. అలాగే పాముల వల్ల భయం కలిగితే విషాన్ని విరి చే ఔషధాలను, మంత్రగాళ్ళను సిద్ధంగా ఉంచాలని చెపుతాడు. రాక్షసుల వల్ల భ యం కలిగినప్పుడు బలప్రయోగంతో పా టుగా రాక్షస వినాశకాలైన కర్మల నాచరించాలి. పాలకుల అప్రమత్తత రాక్షస భావన ను అంతంచేస్తుంది. నిజానికి, ప్రజలకు ఎ లాంటి ఆపత్తు కలిగినా రాజు తండ్రిలాగా వారిని ఆదుకోవాలని చెపుతాడుచాణక్య.
సమాజంలో ఉత్పత్తి ఉత్పాదకతలను పెంచడం, సంపదను సృష్టించడం, అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అర్హత ప్రాతిపదికగా సంక్షేమాలపై సంపదను వ్య యించడం, వ్యవస్థలు సక్రమంగా నడిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం పాలకుల కర్తవ్యం. రాజ్యంలో శాంతిభద్రతలు నిలిస్తేనే పెట్టుబడులు పెట్టడం, వ్యా పారాలు విస్తరించడం, ఉపాధి అవకాశాలు పెరగడం జరుగుతుంది.
జాతీయభా వన లోపించడం వల్ల పాలకులు అధికారాన్ని హక్కుగా భావించి స్వార్థపరులై తరతరాలకు సరిపడా సంపదను దోచుకోవడం.. దాచుకోవడం, ప్రజల సంపదను తమ విలాసాలకై వ్యయించడం చేస్తుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారా న్ని నిలుపుకునేందుకై అలవికాని హామీలనిచ్చి వాటిని అమలు పరచలేని పాలకులు చరిత్రహీనులై నిలుస్తారు. అలాంటి అధికారులను, పాలకులను వేగంగా తీవ్రంగా శి క్షించాలంటాడు, చాణక్య.
సంపద సృష్టికి.. భూమి, శ్రమశక్తి, పెట్టుబడులు, నిర్వహణా విధానం అనబ డే నాలుగు అంశాలు ప్రధానమైనవి. భూ మికి అధికారి పాలకుడు.. ఉద్యోగులు శ్ర మశక్తికి ప్రతీకలు.. వ్యాపారస్థులు పెట్టుబడులకు కాగా నిర్వహణా విధానానికి విజ్ఞా నం, సాంకేతికత, నైపుణ్యాలు ప్రతీకలు. ఈ నాలుగు రంగాలు అంకితభావంతో, జవాబుదారీతనంతో, స్వార్థపరతకు దూరంగా సమన్వయంతో నడచినప్పుడే అభ్యుద యం సాధ్యపడుతుంది.
నిలకడ గలిగిన అభ్యుదయం దీర్ఘకాలిక ప్రయోజనాలను సిద్ధింపచేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్తమ పాలకులకు చాణక్య నిర్ణయించిన అర్హతలు లేదా సూచికలను ఈనాడు చాలమంది పాలకులు అందుకోలేక పోవడం విచారకరం. అయితే సూత్రప్రాయంగా చాణక్య సూచించిన విధానాలలో కొన్నింటికీనాడు కాలం చెల్లియుండవచ్చు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయా పార్టీల ప్రాధాన్యతలు, ఆశయాలు, అస్మదీయుల ఒత్తిడులు.. అ భ్యుదయం, సంక్షేమాల లక్ష్యాలను దూరం చేయవచ్చు. అయితే ఏ కాలంలోనైనా నైతిక విలువలు లేనట్టి పాలకులలో పారదర్శకత లోపించడం, జవాబుదారీతనం లేకపోవడం, బాధ్యతారాహిత్యం, అసమర్థత, అవివేకత చోటు చేసుకుంటే దేశం అప్పులపాలు కావడం జరుగుతుంది.
గత 27 నెలలలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు 3.47 లక్షల కోట్లు. ఇంతగా చేసిన అప్పులు ఉత్పత్తి, ఉత్పాదకత, విద్య, ఆరోగ్య రంగాలపై ఖర్చుపెడితే సంపద పెరుగుతుంది. ఫిన్లాండ్ దేశం గత తొమ్మిది సంవత్సరాలుగా సంతోష సూచికలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటున్నది. దానికి కారణం ఆ దేశం విద్యను ప్రాధాన్యతాంశంగా భావించడమే అంటున్నారు విశ్లేషకులు.
దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు పాలకుల అంచనాలు తప్పి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములం కావడమో.. లేక వాటి ప్రభావానికి గురికావడమో జరగవచ్చు. అప్పుడు ప్రజల రక్షణ ప్రాధాన్యతాంశం అవుతుంది. దానికి భారతదేశమే కాదు.. ఏ దేశమూ అతీతం కాదు.




