విద్యకు సరిపడా నిధులివ్వరా?
ఐ.ప్రసాదరావు :
* ప్రస్తుత కాలంలో విద్య కేవలం పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ డిజిటల్ రూపంలోకి మారుతోంది. మన రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుపై తగినంత దృష్టి సారించలేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు నగర విద్యార్థులతో పోటీ పడాలంటే వారికి ఈ-లెర్నింగ్ వనరులు అందుబాటులో ఉండాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రూ.3,24,234 కోట్ల బడ్జెట్ లో, విద్యా రంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించడం విస్మయానికి గురిచేస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ విద్యా రంగానికి ప్రతి యేటా 15 శాతం నిధులు ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చింది. అధికారంలోకి వ చ్చాక మాత్రం ఆచరణలో చూపడం లేదు.
తాజా బడ్జెట్‌లో సర్కార్ విద్యకు కేవలం 8.22 శాతం నిధులతో సరిపెట్టింది. ఇది ప్రభుత్వ మాటలకు, క్షేత్రస్థాయి నిర్ణయాల కు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని చూపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరచూ విద్యా రంగంపై చేసే ఖర్చును పెట్టుబడిగా భావించాలని చెబుతుంటారు. సంపద సృ ష్టికి విద్యే మూలమని పేర్కొంటారు.
కానీ, బడ్జెట్ గణాంకాలు చూస్తుంటే ఆ మాట లు కేవలం నీటి మూటలని తేలిపోయింది. విద్యా కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందాలంటే కనీసం 18 శాతం నిధులు అవసరం. దేశ సగటు 14 నుంచి 15 శాతం ఉండగా, మన రాష్ట్రం అంతకంటే తక్కువ కేటాయించడం ఆందోళనకు గురిచేస్తోంది.
మౌలిక సదుపాయాలేవీ
రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సం స్థల ఆధిపత్యం పెరిగిపోయింది. విద్యా రం గం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు గు రైం ది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థు లు అత్యధికంగా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారు. వీరికి నాణ్యమైన, సమానమైన విద్యను అందించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. విద్యా రం గాన్ని బలోపేతం చేయడానికి కేవలం భవనాలు ఉంటే సరిపోదు. ఆధునిక ల్యాబ్లు, డిజిటల్ క్లాస్ రూమ్‌లు, లైబ్రరీల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.
పాఠశాలల్లో వేల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉపా ధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో నాణ్యమైన బోధన ఎలా సాధ్యమో ప్రభుత్వం ఆ లోచించాలి. బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ పథకాలు అమలు చేయడం మంచి నిర్ణయాలే. అయితే ప్రాథమిక వసతులు లేని చోట ఈ పథకాలు పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేవు.
విప్లవాత్మక మార్పులు అవసరం
ఆధునిక ప్రపంచంలో ఒక దేశం లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయాలి. ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాఠశాల స్థాయి నుంచి సిలబస్ను మార్చా లి. కేవలం మార్కుల కోసం కాకుండా వి జ్ఞానం కోసం చదివే వాతావరణం కల్పించాలి. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన విభా గాలకు (ఆర్‌అండ్‌డీ) భారీగా నిధులు పెం చాలి.
కొత్త ఆవిష్కరణలు చేసే విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించా లి. మన విద్యార్థులు ఉన్నత చదువుల కో సం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అవకాశాలు కల్పించాలి. ఇతర దేశాలపై ఆధా రపడటం తగ్గించి స్వయం సమృద్ధి సాధించాలి. అప్పుడే మన రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం అవుతుంది.
ప్రపంచ పటంలో చైనా, వియత్నాం వంటి దేశాలను గమనిస్తే మనకు కొన్ని పాఠాలు అర్థమ వుతాయి. ఆ దేశాలు మనకంటే ఆలస్యం గా స్వాతంత్య్రం పొందినా అభివృద్ధిలో ఎంతో ముందుకు వెళ్లాయి. అందుకు ప్రధాన కారణంగా ఆయా దేశాల ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యమిస్తాయి. ప్రభు త్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాకుండా దేశ భవిష్యత్తు కోసం గట్టి నిర్ణయాలు తీసుకోవాలి.
అత్యాధునిక సాంకేతికత అవసరం
ప్రస్తుత కాలంలో విద్య కేవలం పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా విద్యా వ్యవస్థ డిజిటల్ రూపంలోకి మారుతోంది. మన రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో హై-స్పీడ్ ఇంట ర్నెట్ సౌకర్యం, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుపై తగినంత దృష్టి సారించలేదు. గ్రా మీణ ప్రాంత విద్యార్థులు నగర విద్యార్థులతో పోటీ పడాలంటే వారికి ఈ- వనరులు అందుబాటులో ఉండాలి. ప్రతి తరగతి గదిని డిజిటల్ క్లాస్ రూమ్‌గా మార్చడానికి భారీగా నిధులు అవసరం.
కృత్రిమ మేధ (ఏఐ), కోడింగ్ వంటి ఆధునిక అంశాలను ప్రాథమిక స్థాయి నుంచే నేర్పించాలి. స్మార్ట్ బోర్డులు, టాబ్లెట్లు వంటి పరికరాల పంపిణీకి బడ్జె ట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలి. సాం కేతికతను అందిపుచ్చుకోకపోతే పేద విద్యార్థులు డిజిటల్ డివైడ్ కారణంగా వెనుకబ డిపోయే ప్రమాదం ఉంది. కేవలం భవనాలకు రంగులు వేయడం మాత్రమే కాకుం డా, విద్యార్థులను గ్లోబల్ సిటిజన్‌గా తీర్చిదిద్దేలా డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి.
హామీల విస్మరణ
బడ్జెట్‌లో కొన్ని అత్యంత కీలకమైన అంశాల ప్రస్తావన లేకుండా పోయింది. ల క్షలాది మంది నిరుద్యోగులు ఎంతో ఆశ తో ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ జాడ ఎక్కడా లేదు. ఎన్నికల హామీలో భాగమైన నిరుద్యోగ భృతి గురించి కనీస ప్రస్తావన చేయలేదు. విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీల పథకం ఏమైందో ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టానుసారంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించే చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది.
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నూతన వేతన సవరణ (పీఆర్సీ), డీఏ బకాయిలు, మ ధ్యంతర భృతి (ఐఆర్) వంటి అంశాలను బడ్జెట్‌లో చేర్చకపోవడం శోచనీయం. పదవీ విరమణ చేసిన వృద్ధులకు అందాల్సిన ఆర్థిక వనరులపై స్పష్టత లేదు. ఆర్థిక భద్రత లేని వాతావరణంలో సమసమాజ నిర్మాణం ఎలా సాధ్యమో పాలకులు విశ్లేషించుకోవాలి.
ఉచిత పథకాల భ్రమ
ప్రభుత్వాలు కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం ఉచిత పథకాలపై విపరీతమై న ఖర్చు చేస్తున్నాయి. ఈ అనుత్పాదక వ్య యం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పెరుగుతోంది. సంక్షేమ పథకాలు కేవలం నిజమై న అర్హులకు మాత్రమే అందేలా చూడాలి. అవసరం లేని వారికి కూడా ఉచితాలు పంచడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుం ది. ఈ నిధులను విద్యా, వైద్య రంగాలకు మళ్లిస్తే సమాజానికి శాశ్వత ప్రయోజనం చేకూరుతుంది. 2047 నాటికి వికసిత తె లంగాణగా ఆవిర్భవించాలంటే విద్యా రం గమే ఏకైక మార్గం.
లోటు బడ్జెట్ను మిగు లు బడ్జెట్గా మార్చే దిశగా అడుగులు వే యాలి. ఉత్పత్తి రంగాలను ప్రోత్సహించ డం ద్వారా కొత్త ఉద్యోగాలను సృష్టించాలి. స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయి కి తీసుకెళ్లాలి. ప్రతి రంగంలోనూ స్వావలంబన సాధించినప్పుడే నిజమైన అభి వృద్ధి సాధ్యమవుతుంది. పాలకులు తమ ప్రణాళికలను కేవలం వచ్చే ఎన్నికల వరకు కాకుండా రాబోయే తరాల కోసం రూ పొందించాలి. ఉచితాలు ఇస్తేనే ప్రజలు మళ్లీ అధికారాన్ని ఇస్తారనే ఆలోచన నుం చి బయటపడాలి.
మంచి అభివృద్ధి పరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజలే స్వ చ్ఛందంగా మద్దతు తెలుపుతారు. నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, ఉపాధి అవ కాశాలు కల్పిస్తే ఏ సమాజమైనా వేగంగా ఎదుగుతుంది. విద్యా రంగానికి కనీసం 15 శాతం బడ్జెట్ కేటాయించడం అనేది కేవలం అంకెలకు సంబంధించిన విషయం కాదు. అది రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం. నోటి మాటలతో కాకుండా స్పష్టమైన విధానాలతో ప్రభుత్వం ముం దుకు సాగాలి. పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన విద్యను అందించడం ద్వారానే సమ సమాజ కల సాకారమవుతుంది.
వ్యాసకర్త సెల్:
63056 82733




