13-09-2025 10:46:13 PM
నిర్మాణ కమిటీ ఒప్పందాలపై జాప్యం..
కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం ఏరియా లో ని అన్ని మైన్,డిపార్ట్మెంట్ లలో గేట్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తో శుక్రవారం జరగాల్సిన సీఎండీ, స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించిన పలు విషయాలును, కార్మికులకు వివరించారు.గత సంవత్సర కాలంగా గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ తో పలు కార్మిక సమస్యల పై రెండు సార్లు డెరైక్టర్ పా, ఒకసారి సంస్థ సీఎండీ తో పలు అంశాల మీద చర్చ చేసి సత్వరమే కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలుపరుస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం ఇప్పటికీ ఆ సమస్యల పట్ల సర్క్యులర్ లు జారీచేయకుండా జాప్యం చేస్తుండటం మితిమీరిన రాజకీయ జోక్యం తో కార్మిక సమస్యలను పక్కదారి పట్టించడం చేస్తున్నారని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతి మీటింగ్ లో మారుపేర్ల సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన యాజమాన్యం వాటి అమలకు అడ్వకేట్ జనరల్ తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని దాటవేస్తూ కనీసం సమస్య పరిష్కారం కోసం సర్క్యులర్ లు కూడా ఇవ్వకుండా బాధిత కార్మికులను మోసం చేస్తున్నట్లు తెలిపారు. సొంత ఇంటి పథకం కింద కమిటీ వేసి విధివిధానాలు ప్రకటించి అందుకు అనుగుణంగా అమలు పరుస్తామని తెలిపిన యాజమాన్యం,కనీసం కమిటీ లో సభ్యులను కూడా ఇంతవరకు ఏర్పాటు చేయలేదని అన్నారు.మెడికల్ బోర్డు విషయంలో ఏసీబీ విచారణ పేరుతో మెడికల్ బోర్డ్ నిర్వహించకుండా కార్మికుల పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఎప్పటిలాగే యధావిధంగా బోర్డు నిర్వహించాలని డిమాండ్ చేశారు.వాస్తవ లాభాలు ప్రకటించి అందులో 35శాతం కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలన్నారు.
ఇన్కమ్ టాక్స్ పేర్క్స్ విషయంలో లాభాల వాటాకు ముడిపెడుతూ యాజమాన్యం కొర్రీలు పెట్టడం సమంజసం కాదని లాభాల వాటా కార్మికుల కష్టానికి ప్రతిఫలంగా అనాడు ఏఐటీయూసీ పోరాటాలు చేసి సాధించిన హక్కు అని ఇన్కమ్ టాక్స్ పేయర్స్ రిటర్న్స్ విషయంలో దానికి సంబంధం లేకుండా కోల్ ఇండియా మాదిరి పెర్క్స్ మీద రిటర్న్స్ యజమాన్యమే భరించాలని డిమాండ్ చేశారు. ఎన్నడు లేని విధంగా ట్రాన్స్ఫర్ పాలసీ నీ తీసుకువచ్చి కార్మికులను బదిలీ చేసే విషయంలో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఈ పీ ఆపరేటర్ ల విషయంలో ఒప్పుకున్న ప్రమోషన్ పాలసీ మీద కూడా ఇంతవరకు సర్క్యులర్ లు ఇవ్వలేదన్నారు. డిస్మిస్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలని కోరగా వారి పై నిర్ణయాన్ని నాన్చివేత ధోరణితో నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.
అన్ని కేడర్ స్కీమ్ లు పరిష్కరించాలని డిమాండ్ చేయగా వాటి మీద కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు ఇవ్వాలని సమావేశంలో డిమాండ్ చేశారు.అర్హత కలిగిన ఓవర్మన్ ల ప్రమోషన్ పాలసీ పట్ల కూడా ఆదేశాలు జారీ చేయలేదని ఖాళీలు లేవని తాత్సారం చేయడం పట్ల గుర్తింపు కార్మిక సంఘం నాయకులు మండిపడ్డారు. క్లరికల్ ఖాళీలు పూరించాలని రెండు సంవత్సరాల నుండి కనీసం క్లర్క్ పోస్ట్ ల కోసం రాతపరీక్ష కూడా పెట్టకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. న్ -1 ప్లే డే విధానం తీసివేసి కార్మికులకు పాత పద్ధతిలోనే ప్లే డే లు, పీహెచ్డీ, ఓటి లు ఇవ్వాలని అన్నారు.