calender_icon.png 4 July, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రినిడాడ్ అండ్ టుబాగో చేరుకున్న ప్రధాని మోదీ

04-07-2025 08:43:04 AM

పోర్ట్-ఆఫ్-స్పెయిన్రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ఈరోజు తెల్లవారుజామున ట్రినిడాడ్, టొబాగో(Trinidad and Tobago) చేరుకున్నారు. పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రినిడాడ్, టొబాగో ప్రధానమంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేస్సార్‌కు మహా కుంభ్ నుండి సంగం, సరయు నది పవిత్ర జలాలను, రామమందిర ప్రతిరూపాన్ని బహూకరించారు. 1999 తర్వాత భారత ప్రధాని టుబాగోలో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రధాని మోదీ టొబాకో అధ్యక్షురాలు, ప్రధానితో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ట్రినిడాడ్ అంట్ టొబాకో పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. కౌవాలో ప్రవాస భారతీయుల సభలో కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 

 ట్రినిడాడ్ -టొబాగోలోని భారతీయ సమాజం ప్రయాణం ధైర్యంతో కూడుకున్నదని, వారి పూర్వీకులు అనుభవించిన కష్టాలు బలమైన ఆత్మలను కూడా విచ్ఛిన్నం చేయగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. గురువారం కౌవాలోని నేషనల్ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో జరిగిన ఒక కమ్యూనిటీ కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. కరేబియన్ దేశంలో తొలిసారిగా భారతీయ సమాజంతో సమావేశమైన ప్రధానమంత్రి, మనమందరం ఒకే కుటుంబంలో భాగమే కాబట్టి ఇది పూర్తిగా సహజంగా అనిపించిందని అన్నారు. ట్రినిడాడ్, టొబాగో జనాభా సుమారు 13 లక్షలు, వీరిలో 45 శాతం మంది భారతీయ సంతతికి చెందినవారు. ప్రధాని మోదీ తన పర్యటన మూడవ దశలో భాగంగా అర్జెంటీనాకు (జూలై 4–5) వెళతారు, తరువాత బ్రెజిల్‌కు వెళతారు, అక్కడ ఆయన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రాష్ట్ర పర్యటన చేపడతారు. బ్రెజిల్ పర్యటన తర్వాత ప్రధాని నమీబియా వెళ్లనున్నారు.