04-07-2025 01:32:47 AM
* లౌకిక పదం రాజ్యాంగ ప్రాథమిక స్వభావంతో ఏకీభవించదు. అందుకే ఈ అంశం పదే పదే చర్చనీయాంశమవుతోంది. నా దృష్టిలో ధర్మం అంటే తప్పు, ఒప్పుల గురించి ఆలోచించడమే. ఒప్పును స్వీకరించడం.. తప్పును తిరస్కరించడం. లౌకికం గా మారడం అంటే మనకు తప్పు, ఒప్పులతో సంబంధం లేదు. ఇది ఎవరి జీవితంలోనూ జరగదు. అందుకే లౌకిక అనే పదం సరైనది కాదు.
స్వామి
అవిముక్తేశ్వరానంద్ సరస్వతి
వారణాసి, జూలై 3: భారత రాజ్యాంగంలో ‘లౌకిక’ అనే పదం భాగం కాదం టూ ఉత్తరాఖండ్ జ్యోతిర్మఠ్ పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి కీల క వ్యాఖ్యలు చేశారు. ఈ పదం మొదట భారత రాజ్యాంగంలో లేదని.. ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ ప్రవేశికలో ‘లౌకిక’ పదం చేర్చబడిందని తెలిపారు.
ప్రవేశిక నుంచి ‘లౌకిక’, ‘సోషలిస్ట్’ పదాలను తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే చేసిన వ్యాఖ్య లను తాను సమర్థిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘లౌకిక అనే పదం మొదట రాజ్యాంగంలో లేదు.
ఆ తర్వాత దీనిని రాజ్యాంగంలో చేర్చారు. లౌకిక పదం రాజ్యాంగ ప్రాథమిక స్వభావంతో ఏకీభవించదు. అందుకే ఈ అంశం పదే పదే చర్చనీయాంశమవుతోంది. నా దృష్టిలో ధర్మం అంటే తప్పు, ఒప్పుల గురించి ఆలోచించడమే. ఒప్పును స్వీకరించడం.. తప్పును తిరస్కరించడం. లౌకికంగా మారడం అంటే మనకు తప్పు, ఒప్పులతో సంబంధం లేదు. ఇది ఎవరి జీవితంలోనూ జరగదు. అందుకే లౌకిక అనే పదం సరైనది కాదు.
అయినా సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను ఎమర్జెన్సీ సమయంలో జోడించారు.’ అని స్వామీజీ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సెక్యులర్’, ‘సోషలిస్ట్’ పదాలు భాగం కాదని.. వాటిని వెంటనే తొలగించాలని ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. 1975 ఎమర్జెన్సీ సమయంలో లౌకిక, సోషలిస్ట్ పదాలను బలవంతంగా రాజ్యాంగంలో ఇరికించారని ఆయన తెలిపారు.
అయితే దత్తాత్రేయ వ్యాఖ్యలకు తర్వాత మద్దతు పెరుగుతూ వచ్చింది. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సహా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు ప్రవేశిక నుంచి సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తొలగించడమే మంచిదని పేర్కొన్నారు.